అన్నింటిలో మొదటి నియమం శివుడిని ఎల్లప్పుడూ స్వచ్ఛమైన మనస్సు, శరీరం తో పూజించాలి

నేలపై కూర్చొని శివుడిని ఎప్పుడూ పూజించకండి . శివుని ఆరాధనలో దర్భాసనాన్ని ఉపయోగించండి

శివుడిని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరంముఖంగా పూజించాలి

శివపూజ సమయంలో మీ మనస్సులో ఎలాంటి కోపం , అసూయ, మరేదైనా తప్పుడు భావం రానీయకుండా చూసుకోవాలి

శివుడిని పూజించేటప్పుడు, భస్మం ,రుద్రాక్ష మొదలైన వాటిని శివునికి సమర్పించి, మీ నుదుటిపై భస్మాన్ని ధరించండి, రుద్రాక్షను ధరించండి

శంకరుని పూజలో నువ్వులు, సంపంగి పువ్వులు ఉపయోగించరాదు

వీలైతే, తెల్లటి పువ్వులు, గంజాయి , బిల్వ పత్రం , జమ్మి ఆకులు మొదలైన వాటిని శివుని పూజలో సమర్పించాలి

శివలింగంపై పాల పెకేట్లతో అభిషేకం చేయవద్దు. ఎల్లప్పుడూ ఒక పాత్రలో పాలు పోసి శివలింగానికి అబిషేకం చేయండి

శివునికి సమర్పించే పాలు ఎప్పుడూ చల్లగా ఉండాలి . ఎప్పుడూ పాలు కాచి శివునికి సమర్పించవద్దు

ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాలని ఆలోచిస్తున్నట్లయితే, శివునితో పాటు, నందిని, గణేశుడు, పార్వతిని కూడా ప్రతిష్టించి పూజించండి