విక్టరీ వెంకటేష్‏కు తెలుగు ప్రేక్షకుల ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెంకీ అంటే అభిమానం ఎక్కువ.

ఇక ఇటీవల రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక ఈ ఏడాది డైరెక్టర్ శైలేశ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు.కెరియర్ పరంగా వెంకీకి ఇది 75వ సినిమా.

వెంకట్ బోయనపల్లి నిర్మిస్తోన్న ఈ సినిమాయాక్షన్ ఓ రేంజ్‏లోనే ఉంటుందనేది అర్థమయ్యింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రయూనిట్. ఈ ఏడాది డిసెంబర్ 22న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపించి.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా హిట్‌’ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న రుహాని శర్మ సైంధవ్‌ లో వెంకటేష్‌ సరసన నటిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

డాక్టర్‌ రేణు పాత్రలో రుహాని నటిస్తున్నట్లు చెప్పారు. మెడలో స్టెతస్కోప్‌తో సీరియస్‌లుక్‌లో ఉన్న ఈ పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రుహానిని హీరోయిన్‌గా తీసుకోవడంపై శైలేష్‌ కొలను ట్వీట్‌ చేశారు. ‘నా మెదటి సినిమా హీరోయిన్‌తో మరోసారి వర్క్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు.