శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్’ చిత్రంలో కథానాయికిగా కనిపించింది రుహానిశర్మ.
అయితే ఆమె ‘సైంధవ్’లోనూ ఓ కథానాయికిగా చేస్తున్న సంగతి తెలిసిందే.
వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న చిత్రమిది.
శ్రద్ధాశ్రీనాథ్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
కాగా ఈ చిత్రం నుంచి శుక్రవారం రుహాని ఓ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం.
ఈ చిత్రంలో డా.రేణుగా కనిపించనుంది రుహాని.
ప్రస్తుతం విశాఖపట్నంలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
ఈ ఏడాది డిసెంబరు 22న దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.