విడుదలైన 8 నెలల తర్వాత కూడా ట్రిపుల్ ఆర్ పేరు ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది.
మొన్న రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు.. నిన్న గోల్డెన్ గ్లోబ్స్‌కు నామినేషన్స్.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది ఈ చిత్రం.
ఒకటి రెండు కాదు.. 25 ఏళ్ల కింద రజినీకాంత్ క్రియేట్ చేసిన రికార్డులను కూకటి వేళ్ళతో సహా పెకిలించారు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. భారతీయ సినిమాను దేశాలు, ఖండాలు దాటించేసి.
తాజాగా ఈ సినిమా జపాన్‌లో హైయ్యస్ట్ ఇండియన్ గ్రాసర్‌గా నిలిచింది. 25 ఏళ్లుగా ఈ రికార్డు రజినీకాంత్ పేరు మీదే ఉంది.
25 ఏళ్లుగా ఎన్ని సినిమాలు వచ్చినా.. ముత్తు కలెక్షన్స్ క్రాస్ చేయలేకపోయాయి.
తాజాగా ట్రిపుల్ ఆర్ 55 రోజుల్లోనే 2 లక్షల 71 వేల ఫుట్ ఫాల్స్‌తో పాటు.. 410 జపనీస్ మిలియన్ యిన్స్ వసూలు చేసింది.
రాజమౌళితో పాటు చరణ్, తారక్ సైతం జపాన్ వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. అందుకే ముత్తు పాతికేళ్ళ రికార్డు బ్రేక్ చేయగలిగింది ట్రిపుల్ ఆర్.