దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే
ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానంలో సత్తా చాటింది
రెండు కేటగిరీల్లో అవార్డ్ కోసం పోటీ పడింది ఆర్ఆర్ఆర్
బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు.. నాటు..’ నామినేట్ అయ్యింది
కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ విన్ అయ్యింది. బెస్ట్ సాంగ్ గా నాటు నాటు సాంగ్ కు అవార్డు లభించింది
మరికాసేపట్లో బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో విన్నర్ ను అనౌన్స్ చేయనున్నారు
బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో మొత్తం 5 సినిమాలు నామినేట్ అయ్యాయి.. వీటల్లో ఆర్ఆర్ఆర్ వైపే అందరి దృష్టీ ఉంది
ఇప్పుడు అమెరికా అవార్డ్స్ రేస్‌లోనూ ఆర్ఆర్ఆర్ ఉండటం తెలుగు ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం
2022 మార్చి 24న రిలీజ్.. వరల్డ్‌వైడ్ రూ.1200 కోట్ల కలెక్షన్‌స్ సాధించింది
అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అంటే అది ఆస్కార్‌కు ఎంట్రీ లాంటిది అంటుంటారు.. ఇవాళ ఇక్కడ దర్శకధీరుడు రాజమౌళి సినిమాకి పురస్కారం లభించడంతో ఆస్కార్ అంచనాలూ పెరిగిపోయాయి