తెలుగు సినిమా కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో మైల్‌స్టోన్. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది.

భారత సినిమా ఆస్కార్ కల నెరవేరింది.  ప్రపంచ వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీ ఆస్కార్‌ వేదికపై సత్తా చాటింది.

95వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో..  బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక అవార్డ్‌ దక్కించుకుంది.

ఆస్కార్‌ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా రికార్డుకెక్కింది. సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ వేదికపైకి వెళ్లి​ అవార్డును స్వీకరించారు.

నా మనసులో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్.ఆర్.ఆర్ గెలవాలి. ఇది ప్రతి ఇండియన్‌కి గర్వకారణం.అవార్డును స్వీకరించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌.. నన్ను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టింది. RRR దేశాన్ని గర్వపడేలా చేసింది.” అని అవార్డు అందుకున్న అనంతరం కీరవాణి బావోద్వేగంతో మాట్లాడారు.

నాటు నాటు లైవ్ ఫెర్మార్మెన్స్‌తో అదరగొట్టారు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌. ఇండియన్‌ ట్రెడిషనల్‌ వేర్‌ లాల్చీ పంచకట్టులో ప్రపంచ వేదికపై నాటు నాటు పాటను ఆలపించారు.

డాన్స్ వీడియో