‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రనికి మరో విశేష గౌరవం లభించింది
ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్’ వేదికపై ‘నాటు నాటు’ లైవ్ లో పాడే అవకాశం దక్కింది
తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది ఆస్కార్ అకాడమీ బృందం
ఈ మేరకు గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ మార్చి 12న లాస్‌ఏంజెల్స్‌లో జరగనున్న ఆస్కార్ వేడుకల్లో ‘నాటు నాటు’ పాట ప్రదర్శన ఇవ్వనున్నారు
హాలీవుడ్ సినిమాలతోపాటు ‘ఆర్‌ఆర్‌ఆర్’కు సైతం ఈ అవకాశం దక్కడంతో చిత్ర ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘ఆస్కార్’కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే
ఈ కేటగిరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ తో పాటు ‘బ్లాక్ పాంథర్ వకాండ ఫరేవర్’లోని ‘లిఫ్ట్ మి అప్’ వంటి మరికొన్ని పాటల కూడా పోటీ పడుతున్నాయి
దీంతో 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం భారతీయ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి ఉన్నారు