యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్‌ల పవర్‌హౌస్‌గా ఉండటం వల్ల గులాబీ సహజమైన ప్రశాంతతను కలిగిస్తుంది
ఈ మొక్క ఉపశమన స్వభావం కలిగిన ఉండటం వల్ల నరాలను ప్రశాంతపరుస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది
ఇది మీలోని శక్తిని పెంచడానికి దీర్ఘకాలిక ఆందోళన,ఒత్తిడి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది
గులాబీ రేకులను టీగా తయారుచేసుకుంటే.. రుతుక్రమంలో తిమ్మిరిని తగ్గించడానికి సహాయ పడుతుంది
ఈ పువ్వు జీర్ణక్రియను , ఆకలిని ప్రోత్సహిస్తుంది. జీర్ణాశయంలోని విషాన్ని తొలిగిస్తుంది
గులాబీ మలబద్ధకం, ఉబ్బరం, అపానవాయువు, కడుపు నొప్పి, వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది
ఎండిన గులాబీ రేకులను వంటలలో లేదా టీలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పిండి పదార్ధం గ్లూకోజ్‌గా విచ్ఛిన్నం కావడం గణనీయంగా తగ్గుతుంది
ఇది భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది తద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తుంది