ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం మంచిదేనా
గర్భంతో ఉన్న మహిళల్లో ఎన్నో సందేహాలుంటాయి. అందులో శృంగారం ఒకటి.
ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం చేయవచ్చా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం..
హైరిస్క్ జోన్‌లో లేని దంపతులు వైద్యుల సలహా మేరకు రొమాన్స్ చేయవచ్చంటున్నారు నిపుణులు.
ఇలా చేయడం వల్ల బిడ్డ ఎదుగుదలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపెట్టదని అంటున్నారు.
గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొంటే గర్భస్రావం అవుతుందని భయపడుతుంటారు. కానీ, ఇది తప్పని నిపుణులు చెబుతున్నారు.
గర్భం ధరించిన మహిళలు శృంగారం చేయడం వల్ల పలు ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..!
శృంగారం వల్ల ప్రైవేట్ పార్ట్స్ లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో కండరాలు దృఢమవుతాయి.
శృంగారం వల్ల భార్య భర్తల మధ్య దూరం పెరగకుండా అనుబంధం మరింత బలపడుతుంది.
గర్భిణిగా ఉన్న సమయంలో ఫిట్‌గా, చురుగ్గా ఉండేందుకు శృంగారం బెస్ట్ అంటున్నారు నిపుణులు.
శరీరంలో పేరుకుపోయే అదనపు కొవ్వులు, క్యాలరీలు కరిగిపోతాయంట.
శృంగారం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుందని ఓ స్టడీలో తేలింది. గర్భిణిగా ఉన్న సమయంలో ఎలాంటి రోగాల బారిన పడకుండా చేస్తుందంట.
శృంగారం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఇవి సంతోషాన్ని కలిగించే హార్మోన్లు.
హైరిస్క్ ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళలు మాత్రం శృంగారానికి దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.