Year Ender 2021: ఆ రికార్డులో రోహిత్ శర్మదే అగ్రస్థానం..!
ఈ ఏడాది రోహిత్ శర్మకు ఎంతో గొప్పగా మారింది. టీ20ఐ, వన్డే ఫార్మాట్లలో జట్టుకు కెప్టెన్‌గా కూడా నియమితుడయ్యాడు.
ఈ ఏడాది మొత్తం 25 మ్యాచ్‌లు ఆడిన రోహిత్, 35 ఇన్నింగ్స్‌ల్లో 1420 పరుగులు చేశాడు. ఇందులో 43 సగటుతో 2 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు చేశాడు.
రోహిత్ ఈ ఏడాది టెస్టుల్లో 906 పరుగులు, వన్డేల్లో 90, టీ20ల్లో 424 పరుగులు చేశాడు.
పాక్ జట్టు టీ20 ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ టీ20ల్లో ఏడాది వ్యవధిలో 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 29 టీ20 మ్యాచ్‌లలో 26 ఇన్నింగ్స్‌లలో 73.66 సగటు, 134.89 స్ట్రైక్ రేట్‌తో 1326 పరుగులు చేశాడు.
ఐర్లాండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 28 మ్యాచ్‌లలో 28 ఇన్నింగ్స్‌లలో 1151 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.