రోహిత్ ఖాతాలో మరో భారీ రికార్డ్..

టీమిండియా సారథి రోహిత్ శర్మ నెదర్లాండ్స్ మ్యాచ్‌లో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.

నెదర్లాండ్స్ మ్యాచ్‌లో 3 సిక్సులు, 4 ఫోర్లుతో 53 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు.

రోహిత్ ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్‌లో 34 సిక్సర్లు బాదేశాడు.

అంతకు ముందు ఈ రికార్డ్ యువరాజ్ (33) పేరిట ఉంది.

ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ (24) నిలిచాడు.

టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ కంటే క్రిస్ గేల్ (63) మాత్రమే అత్యధిక సిక్సర్లు కొట్టాడు.