వివాదాలతో బీసీసీఐ నుంచి తప్పుకున్నాడు.. కట్ చేస్తే.. అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ ప్లేయర్

భారత మాజీ ఆల్ రౌండర్, 1983లో టీమ్ ఇండియాకు ప్రపంచకప్ అందించిన రోజర్ బిన్నీ బీసీసీఐకి కొత్త అధ్యక్షుడిగా మారారు.

బీసీసీఐ ఏజీఎంలో రోజర్ బిన్నీని బోర్డు కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ భారత్ తరపున 27 టెస్టులు, 72 వన్డేలు ఆడారు.

రోజర్ బిన్నీ టెస్టుల్లో 47 వికెట్లు, వన్డేల్లో 77 వికెట్లు తీశాడు.

అలాగే టెస్ట్‌లలో 5, వన్డేలలో ఒక అర్ధ సెంచరీ కూడా బిన్నీ పేరుపై ఉన్నాయి.

బిన్నీ కర్ణాటక తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.

రోజర్ బిన్నీ 14 సెంచరీలు చేశాడు. ఫస్ట్ క్లాస్‌లో 205 వికెట్లు కూడా పడగొట్టడు.

రోజర్ బిన్నీ భారత్ తరపున ఆడిన తొలి ఆంగ్లో ఇండియన్ ప్లేయర్. బిన్నీ స్కాటిష్ సంతతికి చెందినవాడు.

రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీ కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

రోజర్ బిన్నీ ఇంతకు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉండటం గమనార్హం.

అయితే, టీం ఎంపిక సమయంలో రోజర్ బిన్నీ తన కుమారుడికి భారత జట్టులో చోటు కల్పించారని ఆరోపణలు వచ్చాయి.

దీనిపై రోజర్ బిన్నీ స్టువర్ట్ బిన్నీ పేరు రావడంతో సమావేశం నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేశారు.