పెళ్లీడుకు వచ్చిన ఎవరికైనా మొదట ఎదురయ్యే ప్రశ్న.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు.? అని..
తాజాగా ఇలాంటి ప్రశ్ననే ఎదుర్కున్నారు నటి రీతూ వర్మ. తాజాగా ఈ అమ్మడు నటించిన చిత్రం ఒకే ఒక జీవితం..
ఈ సమయంలో రీతూకు తన పెళ్లి ఎప్పుడన్న ప్రశ్న ఎదురైంది. రీతూ వర్మ పెళ్లి విషయమై స్పందిస్తూ..
తన పెళ్లికి ఇంకా సమయం ఉందని తేల్చి చెప్పారు. బహుశా మరో మూడేళ్లు పట్టొచ్చాని క్లారిటీ ఇచ్చేశారు.
ఇక పెళ్లి విషయంలో తన ఇంట్లో కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టే వారు లేరని.. అప్పుడప్పుడు సరదాగా అంటుంటారని చెప్పుకొచ్చారు.
అయితే తన పెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులు పూర్తిగా తనకే వదిలేశారని రీతూ చెప్పుకొచ్చారు.
ఇక తాను ప్రస్తుతం సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని, లవ్‌లో లేనని కూడా క్లారి ఇచ్చేశారు.