జబర్దస్త్ కామెడీ షోలో చలాకీగా కనిపించే నటి రీతూ చౌదరి తాజాగా తన సొంతింటి కల సాకారం చేసుకుంది.
ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్‌లో స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.
తన తల్లిదండ్రులకు సొంతింటి కల ఉండేదని ఇప్పుడు దాన్ని నిజం చేశానని చెప్పింది.
అలాగే తన పేరెంట్స్ పెళ్లిరోజని, తండ్రికి వేడుకలంటే ఇష్టమంటూ అమ్మతో కేక్ కట్ చేయించింది.
ఆ మరుసటి రోజు తన తొలి సంపాదనతో కొనుక్కున్న కారులో రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్లింది.
అక్కడ ఇంటికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసి పనులు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా ఆమె కారులో కూర్చుని ఎమోషనల్ అయింది.
'మా నాన్న ఈ కారులోనే తుదిశ్వాస విడిచాడు. ఇప్పుడు కూడా నాన్న మా వెనకాల సీటులోనే ఉన్నాడనిపిస్తోంది.
నేనెప్పుడూ అలాగే ఫీలవుతాను. మా నాన్న లేకపోయినా ఆయన కల నెరవేర్చాను' అంటూ భావోద్వేగానికి లోనైంది.
ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతుండగా అభిమానులు రీతూ చౌదరికి శుభాకాంక్షలు చెప్తున్నారు.