గతంలోఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. తనను హీరోయిన్ గా పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.
సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ చేతి వేళ్లతో చూపించింది
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి రష్మికకు పరోక్షంగా కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె ప్రవర్తనపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు
ఈ క్రమంలోనే రష్మిక స్పందిస్తూ.. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది
అయితే తాజాగా రిషబ్ శెట్టి పెట్టిన ట్వీట్‌తో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్న సంగతి నిజమేనని తెలుస్తోంది
2016లో విడుదలై మంచి విజయాన్ని అందుకొన్న కిరాక్ పార్టీకి ఈ శుక్రవారంతో ఆరేళ్లు పూర్తయ్యింది
ఈ సెలబ్రేషన్స్ లో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ హీరో రక్షిత్, నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్, మ్యూజిక్ డైరెక్టర్ లోక్ నాథ్ ను ట్యాగ్ చేశాడు
కానీ ఇందులో కథానాయికగా నటించిన రష్మికను మాత్రం ట్యాగ్ చేయకపోవడంతో వీరిద్దరి గొడవలు నిజమనే టాక్ తెరపైకి వచ్చింది