గుండె, మెదడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి? తెలుసుకోవటమెలా అంటారా? ఇందుకు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ రూపొందించిన స్కోరింగ్‌ పద్ధతి ఉందిగా.

‘లైఫ్స్‌ సింపుల్‌ 7’గా పిలుచుకునే దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తుంటారు.

ఇప్పటివరకు ఇందులో ఆహారం, శారీరక శ్రమ, పొగ తాగటం, బరువు, కొలెస్ట్రాల్‌, రక్తంలో గ్లూకోజు, రక్తపోటును పరిశీలిస్తుండగా.. ఇప్పుడు రాత్రిపూట నిద్రనూ జతచేశారు.

 గుండెజబ్బు, పక్షవాతంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 10 లక్షల మంది మరణిస్తున్నారు.

నిజానికి వీటిల్లో చాలా మరణాలు నివారించుకోదగినవే. ఇందుకు నిద్ర కూడా కీలకమే.

సాధారణంగా రాత్రిపూట రక్తపోటు తగ్గుతుంది. కానీ తగినంత సేపు నిద్రపోకపోతే పెరుగుతుంది.

అందువల్ల రాత్రిపూట తగినంత నిద్ర అత్యంత అవసరమని తాజా సవరణ సూచిస్తోంది.

తగినంత అంటే 7-8 గంటల సేపు నిద్ర పోవటం. అంతకన్నా తక్కువైనా, ఎక్కువైనా నష్టమే.

వారాంతాల్లో, పగటిపూట కునుకు తీయటం దీనిలోకి రాదు. ఈ ‘లైఫ్స్‌ ఎసెన్షియల్‌ 8’ అంశాలను మై లైఫ్‌ చెక్‌ టూల్‌తో లెక్కించి 0-100 వరకు స్కోరు ఇస్తారు.