ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది

ఐదు సంఖ్య హనుమంతునికి చాల ప్రీతికరం. కనుక హనుమాన్ మందిరంలో 5 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం

ఆలయాల్లో లభించే సింధూరం నుదుటన ధరించడం, ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగును

హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పళ్ళు , మామిడి పళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగును

ఆంజనేయ స్వామిని పూజించడం వలన శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని విశ్వాసం

జాతకరీత్యా శని గ్రహ దోషంతో బాధపడుతున్న వారు హనుమంతుడిని పూజిస్తే గ్రహశాంతిని పొందుతారు

ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్షు, ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని నమ్మకం

నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు ఆంజనేయుడిని స్మరించినవారికి మృత్యుభయం తొలగుటతో పాటుగా సర్వత్ర విజయం లభిస్తుంది