కార్తీకమాసం నెలరోజులూ హరిహరులకు పూజలు చేస్తారు

ఈ నెలరోజులూ చేసే పూజలు ఒక ఎత్తు, పౌర్ణమిరోజున పూజలు ఫలితం మరొక ఎత్తు

కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణం విశిష్టమైన అంశం

ఏ ఇతర మాసంలోనూ ఇటువంటి ఆచారం మనకు కనబడదు

కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు

అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని చుడతారు. దీనిని యమద్వారం అని అంటారు

ఈ గడ్డి మీద నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు

కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుందని నమ్మకం

జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో గడ్డివాములోనో ధాన్యాగారంలోనో పెడతారు

అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం