5 వికెట్లతో సత్తా చాటిన రేణుకా సింగ్.. భారత రెండో బౌలర్‌గా రికార్డ్..

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది.

ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది.

అయితే, టీమిండియా తరపున అద్భుతమైన బౌలింగ్‌ కనిపించింది.

భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ 5 వికెట్లు పడగొట్టింది.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరపున ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రేణుక నిలిచింది.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ నుంచి తొలి స్పిన్‌ బౌలర్‌ ప్రియాంక రాయ్‌ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రికార్డును సొంతం చేసుకుంది.

2009లో ఆడిన టోర్నీలో ఈ ఘనత సాధించింది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంక రాయ్ 3.5 ఓవర్లలో 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది.

మహిళల టీ20లో భారత్ తరపున ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రేణుకా సింగ్ నిలిచింది.

ఈ మ్యాచ్‌లో రేణుకా సింగ్ సోఫియా డంక్లీ, డేనియల్ వ్యాట్, అలిస్ క్యాప్సీ, అమీ జోన్స్, కేథరీన్ స్కివర్ బ్రంట్‌లను ఔట్ చేసింది.

2021 అక్టోబర్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రేణుకా సింగ్ ఇప్పటివరకు 7 వన్డేలు, 30 టీ20 ఇంటర్నేషనల్‌లు ఆడింది.

వన్డేల్లో 14.88 సగటుతో 18 వికెట్లు తీసింది. ఎకానమీ రేటు 4.62గా ఉంది.

29 టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేస్తూ 22.53 సగటుతో 30 వికెట్లు పడగొట్టింది.