పవన్‌తో కలిసి జాని సినిమాలో చివరిసారిగా కనిపించింది రేణుదేశాయ్‌. ఆతర్వాత ఆమె ఏ చిత్రంలోనూ కనిపించలేదు

సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ సిల్వర్‌స్ర్కీన్‌పై దర్శనమివ్వనుందీ అందాల తార

రవితేజ హీరోగా నటిస్తోన్న టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలో రేణు కీలక పాత్ర పోషిస్తోంది

తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు హాజరైంది రేణు దేశాయ్‌. అనంతరం తన షూట్‌ విశేషాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది

తెల్లచీరతో కాస్త ఓల్డ్‌లుక్‌లో కనిపించిన రేణు షూటింగ్ లొకేషన్ వివరాలను పంచుకుంది

స్టువర్ట్‌ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి

ఈ సినిమా హిట్‌ అయితే మరికొన్ని చిత్రాల్లోనూ రేణు దేశాయ్‌ను చూడొచ్చు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది