పార్టీ సమయంలో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంపై ప్రభావం చూపుతుంది

దీని కారణంగా అలసట, బద్ధకం, డీహైడ్రేషన్, వికారం, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఉంటాయి

అయితే, హ్యాంగోవర్ నుంచి ఉపశమనం పొందే చిట్కాలు మీ కోసం

రాత్రి పార్టీ అయ్యాక నిద్రించే ముందు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది

హ్యాంగోవర్‌ను వదిలించుకోవాలనుకుంటే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత పుష్కలంగా నీరు తాగాలి

ఉదయం నిద్రలేచిన వెంటనే అల్లం, తేనె బ్లాక్ టీ తాగండి

హ్యాంగోవర్ కారణంగా వాంతులు చేసుకుంటే దానిని ఆపడానికి నిమ్మకాయ తీసుకోండి. వాంతులు ఆగినప్పుడు కొబ్బరి నీళ్లు తాగండి

పెరుగులో ఉండే యాసిడ్ కడుపు సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది