దైనందిన జీవితంలో మనం తీసుకునే ఆహారం కారణంగా చాలామందికి ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతుంటాయి
జీర్ణక్రియ ప్రక్రియ సరిగా జరగకపోవడంతో పలు రకాల సమస్యలు చుట్టుముడుతుంటాయి
ముఖ్యంగా మలబద్ధకం సమస్య అన్ని వయసుల వారిని ఇబ్బంది పెడుతుంటుంది
మలబద్దకం నివారణకు పాటించవలసిన ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం
వీలైనప్పుడల్లా గోరువెచ్చని నీటిని తాగితే.. మలబద్ధకం సమస్య నుంచి గట్టెక్కవచ్చు
పైనాపిల్ జ్యూస్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ మలబద్ధకం, ఉబ్బరం, పొత్తికడుపు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది
రోజూ అర టీస్పూన్ సోపు పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో తీసుకుంటే అజీర్ణం, మలబద్ధకం వంటి ఉదరసమస్యలు తగ్గుముఖం పడతాయి
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చుక్కల పిప్పరమెంటు ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి రోజూ ఉదయం పరగడుపున తాగితే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది