సాధారణ చక్కెర గ్లైసీమిక్ ఇండెక్స్ 65. కొబ్బరి చక్కెర జీఐ విలువ 35 మాత్రమే.
దీంతో షుగర్ వ్యాధి గ్రస్తులకు కొబ్బరి చక్కెర మంచి ఎంపిక. దీనిని ఎంత తిన్నా షుగర్ లెవల్స్ పై ప్రభావం చూపించదు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోనే ఉంటాయి.
కొబ్బరి చక్కెర మీ జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉన్న ప్రీబయోటిక్స్ జీర్ణక్రియను అదుపులో ఉంచుతాయి.
శాఖాహారికి మంచి ఎంపిక కొబ్బరి చక్కెర. కోకో షుగర్ ని ఎటువంటి పదార్ధాలు కలపకుండా సహజంగా తయారు చేస్తారు.
ఇది నూటికి నూరుశాతం శాఖాహారం. ఎదుకంటే సాధారణ చక్కెరలో కొన్ని సార్లు తక్కువ స్థాయిలో నైనా జంతు సంబంధ పదార్థాలు కలుస్తాయి
కొబ్బరి చక్కెరలో సాధారణ చక్కెర కంటే దాదాపు 400 రెట్లు ఎక్కువ పొటాషియం అధికంగా ఉంది.
గుండె, నరాల , కండరాల పనితీరును నియంత్రిస్తుంది. అంతేకాదు బీపీని తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కొబ్బరి చక్కెర పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. మెటబాలిజం క్రమబద్దీకరించబడుతుంది.
కొబ్బరి చక్కెరలో ఉండే విటమిన్ సి, నైట్రోజన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
కొబ్బరి చక్కెరలో ఇనుము, జింక్ , కాల్షియం ఉన్నాయి. దీంతో కొబ్బరి చక్కెర తినడంవలన ఎముకలు బలపడతాయి. అంతేకాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.