‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల విజయం తర్వాత గోపీచంద్‌, శ్రీవాస్‌ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రం ‘రామబాణం’

డింపుల్‌ హయాతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు

ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల్లో కనిపించనున్నారు

మే 5న ఈ చిత్రం విడుదల కానున్నట్లు శనివారం చిత్రబృందం ప్రకటించింది

స్టూడెంట్స్ ఎగ్జామ్స్  దృష్టిలో ఉంచుకుని ‘బాగా చదవండి, పరీక్షలు ఇంకా బాగా రాయండి, వేసవి సెలవుల్లో కలుద్దాం..’ అని ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు మూవీ మేకర్స్

ఈ చిత్రంలో విక్కీ అనే ఓ శక్తివంతమైన పాత్రలో గోపీచంద్‌ కనిపించనున్నారు

కుటుంబ చిత్రంగా భావోద్వేగాలతోపాటు, సామాజిక సందేశం కూడా మిళితమైన కథతో చిత్రం రూపొందుతోంది

ఈ చిత్రంలో సచిన్‌ ఖేడ్‌కర్‌, నాజర్‌, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, కాశీ విశ్వనాథ్‌, సత్య, గెటప్‌ శ్రీను, సమీర్‌, తరుణ్‌ అరోరా తదితరులు నటిస్తున్నరు