కిరణ్‌ అబ్బవరం హీరోగా క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం ‘మీటర్‌’

అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో రమేష్‌ కాదూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు

ఈ చిత్రాన్ని చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పిస్తోంది

ఏప్రిల్‌ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది చిత్రబృందం

ఈ నేపథ్యంలో నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం పోలీస్‌ అధికారిగా నటించారు. ఆయన లుక్‌, పాత్ర కొత్తగా ఉంటాయి.

వాణిజ్యాంశాలతో కూడిన పక్కా మాస్‌ చిత్రమిది. కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందించాం అని తెలిపారు