హీరో సందీప్‌ కిషన్‌ నటించిన మైఖేల్‌ సినిమా తొలిసారి పాన్‌ ఇండియా స్థాయిలో ఇటీవలె విడుదలైంది

ఈ సందర్భంగా రీసెంట్‌గా  ఈ చిత్రానికి చిత్రానికి సంబంధించి ఓ  ఇంటర్వ్యూలో పాల్గున్నాడు

ఈ ఇంటర్వ్యూలో సినిమా  విషయాలతో పాటు పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన కొన్ని విషయాలు తెలిపాడు

ప్రస్తుతానికి తాను రిలేషన్‌షిప్‌లో లేనని, అయితే గతంలో ప్రేమలో పడి ఎదురుదెబ్బలు తగిలాయని తెలిపాడు

నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌. నాకు సంబంధించిన విషయాలన్నీ షేర్‌ చేసుకోవాలనుకుంటాను.

నాలాంటి వ్యక్తికి రిలేషన్‌షిప్స్‌ చాలా డేంజరస్‌. అవి నాకు సెట్‌ కావని అర్థమైంది. గతేడాది బ్రేకప్‌ జరిగింది.

ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటకు వస్తున్నా' అని సందీప్‌ కిషన్‌ పేర్కొన్నాడు. కానీ గతంలో ఎవరితో ప్రేమలో ఉన్నాడన్న సంగతి మాత్రం తెలపలేదు

కాగా హీరోయిన్‌ రెజీనా కసాండ్రాతో డేటింగ్‌ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై  అందులో ఏమాత్రం నిజం లేదని తేల్చే చెప్పేసాడు హీరో సందీప్‌ కిషన్‌