వైవాహిక జీవితం అనేది.. జీవితంలో గొప్ప అనుభూతి.. ఇద్దరూ కలిసి జీవితాంతం ఒకరిఒకరు తోడుంటూ ముందుకు సాగుతారు.

జీవిత భాగస్వామితో శారీరకంగా, మానసికంగా కనెక్ట్ అయ్యే విషయంలో.. కొన్ని వ్యాధులు ఆ ఆనందాన్ని దూరం చేసే అవకాశం ఉంది.

మధుమేహం కాలక్రమేణా రక్త నాళాలు, నరాలను దెబ్బతీస్తుంది. లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను కూడా ప్రభావితం చేస్తుంది.

దీని కారణంగా పురుషులలో అంగస్తంభన, శీఘ్ర స్కలనం సమస్య మొదలవుతుంది. మహిళల్లో కోరిక లేకపోవడం, యోని పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి.

రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు కూడా రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దీని వలన లైంగిక సమస్యలు సంభవించవచ్చు.

డిప్రెషన్ లైంగిక జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. నిరాశ, నిస్పృహ కోరికలు కలిగించకుండా చేస్తుంది.

అందుకే.. ప్రతి ఒక్కరూ కొన్ని వ్యాధులకు దూరంగా ఉంటేనే.. వైవాహిక జీవితం, లైంగిక జీవితం ఆనందమయంగా ఉంటుందని.. ఇలాంటి విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు నిపుణులు..