ప్రేమ లేదా వైవాహిక జీవితానికి పునాది ప్రేమ, విశ్వాసం.. ఒకరి పట్ల ఒకరికి ఉన్న శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా ప్రతి జంట తమ భాగస్వామి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తారు.

కొన్నిసార్లు బంధాలు తెగిపోయే పరిస్థితి వస్తుంటుంది. దీంతో ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని కోల్పోతారు.

నమ్మకాన్ని పొందడం అంత సులభం కాదు కావున.. భాగస్వామిని ఆనందంగా ఉంచేందుకు పలు చిట్కాలను పాటించండి..

రిలేషన్ షిప్ ను ఆనందంగా మార్చడానికి మీ పార్ట్‌నర్‌తో అన్ని సమయాల్లో మాట్లాడటానికి ప్రయత్నించండి

ఏదైనా తప్పు చేస్తే క్షమాపణలు కోరుతూ ఉండండి. ఇంకా వివరంగా చెప్పడానికి ప్రయత్నించండి.

ఎల్లప్పుడూ మీ భాగస్వామికి సమయం ఇవ్వండి. కోపంలో ఉన్న గొడవ పడినా వారిని అర్ధం చేసుకోని మాట్లాడండి..