ఇంట్లో ఉన్నట్లుండి చీమలు ప్రత్యక్షం కావడం. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో చీమలు కనిపిస్తుంటాయి.
మళ్లీ కాసేపటికే మాయమైపోతుంటాయి. నల్ల, ఎర్ర చీమలు సడన్‌గా ప్రత్యక్షమవుతుంటాయి.
ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే అది ఇంట్లో ఆనందం, శ్రేయస్సు రావడానికి సంకేతంగా పరిగణిస్తారు.
దీంతో పాటు మీ శారీరక ఆనందాలు పెరగబోతున్నాయనడానికి ఇది శుభ సంకేతం. ఏదైనా ధాన్యంలో నల్ల చీమ కనిపిస్తే అది మరింత శుభప్రదమని అర్థం.
ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే, వాటికి చక్కెర లేదా పిండి వంటి అందిస్తే మంచి జరుగుతుంది.
ఒకేసారి ఎర్ర చీమలు బటయకు వస్తే అది అశుభానికి సూచికగా చెబుతుంటారు. ఇది ఇంట్లో రాబోయే ఇబ్బందులకు సంకేతంగా పరిగణిస్తారు.
ఇంట్లో ఎర్ర చీమలు బయటకు వస్తే, మీరు భవిష్యత్తులో చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని, ఆర్థిక ఖర్చులు కూడా పెరుగుతాయని అర్థం.
చీమలు ఉత్తర దిశ నుంచి వస్తే అది చాలా శుభప్రదం. అలాగే ఎరుపు చీమలు తూర్పు నుంచి వస్తే అది అశుభం.