శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’

సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఇటీవల హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు

ఈ సందర్భంగా హీరో నాని ‘‘దసరా’ మాకు చాలా ఎమోషనల్‌ సినిమా. ఈ చిత్రంతో రివార్డులు, అవార్డులు మొదలవుతాయి

ఇలాంటి మరెన్నో సినిమాలు చేయడానికి ఇది ఆరంభమవుతుందని భావిస్తున్నా. ఈ చిత్రం థియేటర్స్‌లో పూనకాలు తెప్పిస్తుంది

మార్చి 30 తర్వాత నాని, కీర్తి సురేష్‌ పేర్లు మాయమైపోయి ధరణి, వెన్నెల మాత్రమే గుర్తుంటారు

శ్రీకాంత్‌ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు.’ అని పేర్కొన్నారు

తర్వాత కీర్తి సురేష్‌ మాట్లాడుతూ ..‘‘ఇందులో నేను చేసిన వెన్నెల పాత్ర నాకెంతో ప్రత్యేకం

ఇది ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది. ఇక థియేటర్లలో కుమ్మేద్దాం అంతే’’ అని తెలిపారు

ఈ ప్రెస్ మీట్ కి శ్రీకాంత్‌ ఓదెల, దీక్షిత్‌ శెట్టి, ఝాన్సీ, నాగబాబు తదితరులు హాజరయ్యారు