అపురూపంగా చూసుకునే కురులు అకారణంగా రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. ఈ మధ్యకాలంలో చిన్నా.. పెద్ద.. అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరినీ వేదిస్తు్న్న సమస్య జుట్టు రాలడం.
ఈ సమస్యను అధిగమించేందుకు మార్కెట్‌లో దొరికే వివిధ రకాల క్రీమ్‌లను, షాంపూలు, నూనెలను వాడుతుంటారు. అయినా ఫలితం ఉండదు.
నిజానికి అందుకు ఉన్న అనేకానేక కారణాలు ఏంటో తెలుసుకోండి
జుట్టు పలుచగా ఉండే వారికి ఎక్కువగా రాలిపోతుంటుంది. వంశపార్యం పర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు వల్ల కూడా జుట్టు రాలడం
వంశపార్యం పర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు వల్ల బట్టతల రావడం వంటి సమస్యలు వస్తాయి.
స్త్రీలలోనైతే ఐరన్ లోపం, ఋతుక్రమం సక్రమంగా రాకపోవడం, రక్తహీనత, హర్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి కారణాల వల్ల జుట్టురాలిపోతుంటుంది.
వయసు పెరిగేకొద్దీ మహిళలో మెనోపాజ్ సంభవిస్తుంది. ఈ దశలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ఊత్పత్తి తగ్గడం వల్ల కూడా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.