వేసవిలో చాలా మందికి విపరీతంగా చెమటలు పట్టడం కామన్

కానీ కొందరికి మాత్రం సీజన్ తో సంబంధం లేకుండా చెమటలు పట్టేస్తుంటాయి

పగటి పూట మత్రమే కాకుండా.. రాత్రిళ్లు కూడా ఎక్కువగా చెమట రావడం జరుగుతుంది

రాత్రిపూట చెమటలు పట్టడానికి కారణమెంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం

విపరీతంగా మందులు వాడేవారికి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఎక్కువగా చెమటలు వచ్చే అవకాశం ఉంటుంది

మధుమేహం సమస్య ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే వారికి రాత్రిళ్లు చెమటలు ఎక్కువగా పట్టేస్తుంటాయి

ఇన్ఫెక్షన్ భారీన పడినప్పుడు రోగ నిరోధక శక్తి ఆ వైరస్ తో పోరాడుతుంది. ఆసమయంలో ఎక్కువగా చెమట పడుతుంది

 రాత్రిపూట చెమట పట్టడం అనేది కొన్ని క్యాన్సర్లకు సంకేతం. ఇది సాధారణంగా లింఫోమా (రక్త క్యాన్సర్)లో కనిపిస్తుంది