ఈరోజు నుంచి ప్రారంభం అయినా కార్తీక మాసం ఎంతో విశిష్టమైనది

కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి ఈశ్వరుడిని మంచి జరుగుతుంది అని నమ్మకం

ఈ నెలలోనే నాగుల చవితి, ఉత్తాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి పండుగలు కూడా రానున్నాయి

కార్తీక మాసంలో కచ్చితంగా ఏదైనా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలని పెద్దలు అంటారు

ప్రవహించే నదిలోని నీటిపై చంద్ర కిరణాలు పడటం వల్ల ఈ నీరు చంద్రుడి శక్తిని పుచ్చుకుంటుంది

ఈ సమయంలో అమ్మవారు చంద్రకిరణ రూపంలో, ఉసిరికయ రూపంలో దర్శనమిస్తుందని హిందువుల నమ్మకం

కాబట్టి ఈ సమయంలో నదిలో నిలబడి ఈశ్వరుడిని ప్రార్థిస్తూ మూడుసార్లు మునగి తేలితే శరీరానికంతా చంద్ర కిరణాల వల్ల అమృత స్పర్శ కలుగుతుంది

మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేస్తే ఉదర వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది

అంతేకాదు చంద్ర స్పర్శ కలిగిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది