ఏ కూరగాయలు లేకపోతే కనీసం టమాట అయినా వండుకుని కడుపునింపుకునే మధ్య తరగతి కుటుంబాల్లో టమాటా చిచ్చురేపుతోంది

రూపాయికి కిలో చొప్పున అమ్మినా కొనేవారు లేక.. రోడ్లపై పారబోసే టమాట ధర ఇప్పుడు సామాన్యులకు భారంగా మారింది.

రైతు బజార్లలో ఏప్రిల్‌ 5వ తేదీ వరకు కిలో రూ.10కి లభించిన టమాట ప్రస్తుతం రూ.58పైగా పలుకుతోంది

రిటైల్‌ మార్కెట్లు, వ్యాపార దుకాణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో రూ.70 నుంచి రూ.80 వరకు కూడా విక్రయిస్తున్నారు

ఈ ధరలు జూన్, జూలై వరకు ఉంటాయని ఉద్యాన అధికారులు, హోల్‌సేల్‌ వ్యాపారులు, ఉద్యాన రైతులంటున్నారు

స్థానికంగా పంట లేకపోవడంతో టమాట ధరకు రెక్కలొచ్చాయి