సినిమాలు మరియు రాజకీయాల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తారకరత్న గుండెపోటు రావడంతో కొన్ని రోజులపాటు మృత్యువుతో పోరాడి మరణించారు.
అయితే బ్యాగ్రౌండ్ ఉన్న స్టార్ హీరో కాలేకపోయారు తారకరత్న.
సరైన కథలను, సరైన డైరెక్టర్లను ఎంచుకోలేకపోవడం తారకరత్నకు మైనస్ అయిందని చాలామంది భావిస్తారు.
ఒకటో నెంబర్ కుర్రాడు మూవీ తారకరత్న తొలి సినిమా కాగా, ఈ సినిమా కమర్షియల్ గా మంచి ఫలితాన్ని అందుకుంది.
అయితే ఆ తర్వాత హీరోగా తారకరత్నకు ఈ స్థాయి విజయం దక్కలేదు.
నందమూరి హీరోల సినిమాలలో నటించి ఉంటే తారకరత్న స్థాయి మరింత పెరిగేదని, తారకరత్న వేర్వేరు కారణాలవల్ల ఆ విధంగా చేయలేదని బోగట్టా.
హీరోగా సక్సెస్ కాలేకపోయినా నటుడిగా తారకరత్న సక్సెస్ అయ్యారు.
తారకరత్న అమరావతి, రాజా చెయ్యి వేస్తే సినిమాలలో నెగటివ్ షేడ్స్ రోల్స్ లో నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు. తారకరత్నకు నటుడిగా పలు అవార్డులు సైతం వచ్చాయి.