ప్రతి ఒక్కరికి నిద్ర చాలా అవసరం. ఈ విషయం అందరికీ తెలిసిందే.

 అయితే చాలామంది మధ్యాహ్నం భోజనం చేశాక చిన్న కునుకు తీస్తే బాగుంటుందని అనుకుంటారు.

అలా మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపించడం తెలిసిందే. కొందరికి మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు పడుకుంటే కానీ హుషారు కలగదు. 

అలా మధ్యాహ్నం తిన్న తర్వాత ఎందుకు మత్తుగా అనిపిస్తుంది? దీనికి గల కారణం ఏంటో తెలుసుకుందాం..

దీనికి గల కారణం అన్నంలోని గ్లూకోజ్ రక్తంలో వేగంగా కలవటమే.

 అన్నంతో విడుదల అయ్యే మెలటోనిన్, సెరటోనిన్ హార్మోన్లు విశ్రాంతి, మత్తు భావనను కలిగిస్తాయి. 

మనం తినే ఆహారంలో కొవ్వులు అధికంగా మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటే కనుక భోజనం తిన్న వెంటనే నిద్ర వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. 

 కొవ్వు అధికంగా ఉన్న గణాహారం తిన్న తర్వాత, మెదడులోని నిద్ర కేంద్రాలకు సంక్లిష్ట సమ్మేళనాల సంకేతాలు పంపబడతాయి. ఆ సమయంలో నిద్ర ప్రేరేపితం అవుతుంది.