కరోనా సంక్షోభంతో దేశం కొట్టుమిట్టాడుతోన్న వేళ నేనున్నానంటూ ముందుకొచ్చాడు సినీ నటుడు సోనూసూద్‌

ఆపత్కాలంలో అడిగిన వారందరికీ ఆపన్నహస్తం అందించి రియల్‌ హీరోగా మారిపోయాడు.

కరోనా సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా ఆపదలో ఉన్నవారికి తనవంతు సహయం అందజేసి వార్తల్లో నిలిచాడీ హ్యాండ్సమ్‌ యాక్టర్‌.

సోనూసూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ (Sood Charity Foundation) స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమందికి తనవంతు సహాయ సహకారాలు అందించాడీ నటుడు.

తన సామాజిక సేవతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోన్న ఈ ట్యాలెంటెడ్‌ హీరో తాజాగా మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు.

 ఎన్నో మంచి పనులు , సహాయ సహకారాలు అందిస్తున్న ఈ రియల్ హీరో.. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు..

తాజాగా ఈ రియల్ హీరో మరోసారి రోడ్డుమీదకు వచ్చారు.. ఫ్యాన్స్ తో సందడి చేసారు..