బ్యాంకులో మీకు కూడా లాకర్ ఉందా? ఐతే ఆర్బీఐ జారీ చేసిన కొత్త ఆదేశాలు మీరు తెలుసుకోవల్సిందే
లాకర్లు ఉన్న వినియోగదారులు బ్యాంకుతో కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలని ఆర్బీఐ తెల్పింది
ఇందుకు రూ.200 స్టాంపు పత్రాలపై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వవల్సి ఉంటుంది
గడువు జనవరి 1తో ముగియనుండగా గడువును డిసెంబరు 31 వరకు ఆర్‌బీఐ పొడిగించింది
ఒప్పందం చేసుకోని వినియోగదారుల లాకర్లను కొన్ని బ్యాంకులు సీజ్ చేశాయి
లాకర్లలో నగదు నిల్వలను అరికట్టాలనే లక్ష్యంతో బ్యాంకుల్లో ఈ నిబంధన తీసుకొచ్చాయి
ఇకపై కేవలం నగలు, పత్రాలు మాత్రమే లాకర్లలో దాచుకోవాలి. కరెన్సీ నోట్లకు నో పర్మిషన్