మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా విడుదలై సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది
క్రాక్ సినిమా తర్వాత వరుస ప్లాప్‌లు ఎదుర్కొన్నాడు రవితేజ
చాలాకాలం తర్వాత ధమాకా రూపంలో మరో హిట్ దక్కించుకన్నాడీ స్టార్ హీరో
దీంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు
ఓ వీరాభిమాని ఆస్పత్రిలో రవితేజ పోస్టర్‌కు సర్జికల్ బ్యాండేజ్‌తో దండ వేశాడు
అనారోగ్యం కారణంగా థియేటర్‌కు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడట
అన్నయ్య చాలా రోజుల తర్వాత బ్లాక్‌బస్టర్ కొట్టాడని తెగ సంబరపడిపోయాడు ఆ వీరాభిమాని