రవిబాబు.. ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు.
నటుడిగా మంచి పేరు సంపాదించిన ఆయన.. దర్శకుడిగానూ సత్తా చాటారు.
‘అల్లరి’ సినిమా దగ్గర నుంచి ‘అనసూయ’, ‘అవును’ వరకు ఆయన డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఆయన తెరకెక్కించిన కొత్త చిత్రం ‘అసలు’. ఈటీవీ విన్ యాప్‌లో ఈ మూవీని విడుదల చేశారు.
రవిబాబు సినిమాల్లో మెయిన్ లీడ్‌గా ఎక్కువగా పూర్ణ కనిపిస్తుంటారు. ఇప్పుడు రిలీజైన ‘అసలు’లోనూ ఆమెనే ప్రధాన పాత్రలో నటించారు.
రవిబాబు తన మూవీస్‌లో పూర్ణకు వరుసగా ఛాన్సులు ఇవ్వడంపై కొంతకాలంగా నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి.
వీటిపై తాజా ఇంటర్వ్యూలో రవిబాబు క్లారిటీ ఇచ్చారు. ‘పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉందని చాలా మంది అనుకుంటారు.
విజువలైజ్ చేసుకున్న దాని కంటే 200 శాతం బెస్ట్ ఔట్‌పుట్‌ను అందించే ప్రత్యేక నటులను డైరెక్టర్లు సాధారణంగా ఎలాగైతే ఇష్టపడతారో ఇదీ అలాంటిదే.
పూర్ణ అలాంటి ఓ జెమ్’ అని రవిబాబు చెప్పుకొచ్చారు.