బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌తో ఎంగేజ్‌మెంట్‌ కావడంపై పాతికేళ్ల తర్వాత పెదవివిప్పిన నటి రవీనాటాండన్‌

అక్షయ్‌తో వివాహం రద్దైన క్షణాలను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానన్న రవీనాటాండన్‌

‘మోహ్రా’ సినిమాలో అక్షయ్‌, నేనూ జంటగా నటించాం.. ఆ సినిమా సూపర్‌హిట్‌ అయ్యింది

మా రిలేషన్‌.. నిశ్చితార్థం.. బ్రేకప్‌ అంతా వెంటవెంటనే జరిగింది

ఆ తర్వాత ఎవరి జీవితాలు వాళ్లం వేరువేరుగా ప్రారంభించాం

మా నిశ్చితార్థం ఎప్పుడు జరిగిందనేది నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నాటి పరిణామాలు ఇప్పటికీ నా మనసులో అలాగే నిలిచిపోయాయి

వాటిని ఎందుకు గుర్తుపెట్టుకున్నానో నాకే తెలీదు.. అంటూ భావోద్వేగమయ్యారు