సుధీర్‌ వర్మ దర్శకత్వంలో హీరో రవితేజ లాయర్‌గా పాత్రలో నటిస్తున్న చిత్రం రావణాసుర

ఈ మూవీ హీరో సుశాంత్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు

అనూ ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ  ఈ చిత్రంలో హీరోయిన్లు

సోమవారం ఈ చిత్ర టీజర్‌ విడుదల చేశారు మూవీ మేకర్స్

“ప్రతి క్రిమినల్ వాడు చేసిన క్రైమ్ మీద వాడి సిగ్నేచర్ వదిలేసి వెళ్లిపోతాడు.. లుక్ ఫర్ థాట్ సిగ్నేచర్” అంటూ  ఓ అధికారి పాత్రలో జయరామ్‌ కనిపించారు

రవితేజ ఈవిల్ స్మైల్ ఇవ్వడం, యాక్షన్‌లోకి దిగినప్పుడు గర్జించడం వంటివి ఆసక్తికరంగా అనిపించాయి

టీజర్ లో సుశాంత్ మాస్ లుక్ అదిరిపోయింది

'సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురిడిని దాటి వెళ్లాలి' అని రవితేజ డైలాగుతో టీజర్ ముగిస్తుంది

కాగా ఈ చిత్రం ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది