యాక్టర్ గా తన కెరీర్‌ మొదలు కావడం గురించి హీరోయిన్ రష్మిక స్పందించారు

రక్షిత్‌ శెట్టి, రిషబ్‌ శెట్టి గురించి రష్మిక ఆసక్తికర విషయాలు తెలిపారు 

ఇటీవల కన్నడ నటులు రక్షిత్‌ శెట్టి, రిషబ్‌ శెట్టిల విషయంలో  విమర్శలు ఎదుర్కొన్నరు హీరోయిన్ రష్మిక

తాజాగా వాళ్లిద్దరి గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వాళ్ల వల్లే ఇండస్ట్రీలోకి వచ్చానని ఆమె తెలిపారు

‘‘నటిగా ఇన్ని భాషల్లో పనిచేస్తున్నందుకు, ప్రేక్షకులను అలరిస్తున్నందుకు ఆనందిస్తున్నా. ఇప్పటివరకూ కెరీర్‌లో నేను మంచి నటీనటులతో కలిసి పనిచేశాను. అయితే, ఒక నటిగా నేను పరిశ్రమలోకి రావడానికి రక్షిత్‌ శెట్టి, రిషబ్‌ శెట్టినే కారణం. వాళ్లే నాకు ఇండస్ట్రీలోకి దారి చూపించారు. నటిగా తొలి అవకాశాన్ని ఇచ్చారు’’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు 

అనంతరం ఆమె ‘‘సాధారణంగా నేను మౌనంగా ఉండే వ్యక్తిని. అందుకే మొదట్లో ఎన్ని ట్రోలింగ్స్‌ వచ్చినా పట్టించుకోలేదు. ప్రేక్షకులపై నాకున్న గౌరవం అలాంటిది. అదీ కాక మొదట్లో నా గురించే విమర్శలు చేసేవారు. అవేమీ నన్ను ఇబ్బందిపెట్టలేదు. కానీ, ఇప్పుడు ఆ ట్రోల్స్‌ నా చెల్లి, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే నేను వాటిని అంగీకరించలేకపోతున్నా. నా సోదరి మానసిక ఆరోగ్యం కాపాడటమే నా బాధ్యత’’ అని సోషల్‌మీడియా ట్రోలింగ్‌పై స్పందించారు

ఈ భామ గతేడాది ఓ ఇంటర్వ్యూలో ‘కిరిక్‌ పార్టీ’తో తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన ‘పరంవా’ బ్యానర్‌ పేరు చెప్పడానికి ఇష్టబడలేదు

ఇటీవలే రిషబ్‌ నటించిన ‘కాంతార’ చూడలేదని ఆమె చెప్పడంతో పలువురు కన్నడిగులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు 

రిషబ్‌ శెట్టి సైతం ఆమె ప్రవర్తన పట్ల అసహనంగా వ్యక్తం చేసినట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి