ఐపీఎల్‌ ఆరంభం రోజున ఆడిపాడే నాయికల జాబితాలో దక్షిణాది అందం రష్మిక చేరింది.

ఐపీఎల్‌ యాజమాన్యం ఆమె ప్రదర్శన గురించి తెలియజేస్తూ ఒక పోస్ట్‌ను పంచుకుంది.

‘మరపురాని సాయంత్రం కోసం  సిద్ధంగా ఉండండి.

నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ ప్రారంభోత్సవ వేడుకలో రష్మిక ప్రదర్శ ఇవ్వనున్నారు’ అని వ్యాఖ్యలను జోడించారు.

‘రష్మిక మంచి నటే కాదు గొప్ప డ్యాన్సర్‌ కూడా.

ఇప్పుడు మరోసారి లైవ్‌లో తన డ్యాన్స్‌తో వీక్షకులను అలరించనున్నారు’ అని రష్మిక ప్రదర్శన గురించి చెప్పారు.

ఈ వేడుకలో తమన్నా కూడా ఆడిపాడనున్న విషయం తెలిసిందే.