ఛలో సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్న 'పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది.

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకుంటుంది.

పార్ట్ వన్ కంటే పుష్ప 2లో రష్మిక రోల్ ఎక్కువ ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే అటు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంటుంది.

ఇక ఈ అమ్మడు ఇప్పుడు స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేయనుందని తెలుస్తోంది. అది కూడా సూపర్ స్టార్ సినిమాలో..

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సిన్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక  స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తోంది.

గతంలో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మహేష్ సరసన నటించిన విషయం తెలిసిందే.