స్టార్‌ హీరోయిన్‌ రష్మిక ప్రస్తుతం చేతి నిండ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో పుష్ప 2తో పాటు హిందీలో పలు ప్రాజెక్ట్స్‌ చేస్తోంది.

కన్నడ నటి అయిన రష్మిక తెలుగులో చక్రం తిప్పుతొంది. ఇక ఇటీవల బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన తాజాగా ఓ ఇంటర్య్వూలో చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి.

గతంలో తనకు నటిగా తొలి అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్‌ హౌజ్‌ పేరు చేప్పేందుకు ఆసక్తి చూపని ఆమె ఏకంగా తన మాజీ ప్రియుడు రక్షిత్‌ శెట్టికి క్రెడిట్‌ ఇచ్చింది.

నేను నటిని అవుతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ, చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే నటిని కావాలని కొన్ని సినిమా ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని.

అలాంటి సమయంలో ఓ అందాల పోటీలో పాల్గొన్నా. ఈ పోటీలో గెలిచి టైటిల్‌ సొంతం చేసుకున్నా. దీంతో నా ఫొటో అన్ని పత్రికల్లో వచ్చింది.

అది చుసిన రక్షిత్‌ శెట్టికి సంబంధించిన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్‌ నుంచి కాల్‌ వచ్చింది.‘కిరిక్‌ పార్టీ’లో నాకు లీడ్‌ రోల్‌ ఆఫర్‌ చేసారు.

అదే.. ఈమె కాంతార సమయంలో ఓ ఇంటర్య్వూలో నటిగా తనకు కెరీర్‌ ఇచ్చిన ప్రొడక్షన్‌ హౌజ్‌ చెప్పకుండ సో కాల్డ్‌ ప్రొడక్షన్‌ అని వ్యాఖ్యానించింది. దీంతో కన్నడ నాట ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది.