స్టార్ హీరోయిన్ రష్మిక పేరు చెప్పగానే అందరికీ ‘మూడు హిట్స్ ఆరు కాంట్రవర్సీలు’ అనే సామెత గుర్తొస్తుంది.

ఎందుకంటే ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేస్తూ హిట్స్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్న ఈ బ్యూటీ

రియల్ లైఫ్ లోనూ ఎప్పటికప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండతోనూ ఈమె రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన డైలీ రొటీన్ లో ఉండే ఓ క్రేజీ విషయాన్ని బయటపెట్టింది.

‘చిన్నచిన్న విషయాలు కూడా నాకు చాలా కీలకం. పెంపుడు జంతువులతో టైమ్ స్పెండ్ చేయడాన్ని కూడా నేను ఆస్వాదిస్తాను.

 మాటలకు నిజంగా చాలా శక్తి ఉంది. ఓ మనిషి మనసు విరిచేయడానికి ఆ మాటలు చాలు. అందుకే ఎవరేం అనుకున్నా సరే నేను దాన్ని పర్సనల్ గా తీసుకుంటాను.

రోజులో జరిగే చిన్న విషయాల్ని కూడా నేను డైరీలో రాసుకుంటాను. ఇంటికొచ్చిన తర్వాత గౌరవంతో ప్రతి ఒక్కరి పాదాల్ని టచ్ చేస్తాను.

నా ఇంట్లో పనివాళ్ల కాళ్లని కూడా మొక్కుతాను. నాకు మనషుల్ని వేరుచేసి చూడటం నచ్చదు. అందుకే ఇలా చేస్తున్నాను.