పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది.

పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రాణిస్తోంది. 

పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రాణిస్తోంది. 

తాజాగా తన ఇన్ స్టాలో ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. తనపై వస్తున్న ట్రోల్స్ , రూమర్స్ గురించి ఆవేదన వ్యక్తం చేసింది.

కొందరు తన గురించి సోషల్ మీడియాలో చేసే నెగిటివ్ ప్రచారం తన హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తున్నాయని అన్నారు.

ఇప్పటివరకు ట్రోల్స్ భరించిన రష్మిక.. తాజాగా తన మనసులోని బాధను సుధీర్ఘ నోట్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

గత కొన్ని రోజులుగా.. లేదా నెలలుగా వస్తున్న కొన్ని విషయాలు నన్ను ఇబ్బందిపెడుతున్నాయి. ఇప్పుడు వాటిని పరిష్కరించే సమయం వచ్చిందనుకుంటున్నాను.

నేను నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి అనేకసార్లు ద్వేషానికి గురవుతున్నాను. చాలా ట్రోల్స్.. నెగిటివిటి.. నా గురించి మాట్లాడటం.. చాలా బాధిస్తుంది.

మీలో కొందరు నాపై చూపిస్తున్న ప్రేమకు రుణపడిపోయాను. వారి ప్రేమే ఎల్లప్పుడు నన్ను మరింత ముందుకు నడిపిస్తుంది. అంటూ ఓ పెద్ద ఎమోషనల్ నోట్ రాసుకోచ్చింది రష్మిక