స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ సీతారామం.

రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో  రష్మిక మందన(Rashmika Mandanna )కీలక పాత్రలో నటించింది.

ఈ చిత్రంలో అఫ్రిన్ గా కనిపించిన రష్మిక పాత్రకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. 

‘సీతారామం’ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ‘సీతారామం’ కోసం టీమ్ అంతా దాదాపు రెండేళ్ళ పాటు చాలా హార్డ్ వర్క్ చేసింది.

ఆ పాత్ర ఛాలెంజ్ గా అనిపించింది.చాలా కొత్తగా అనిపించింది అన్నారు రష్మిక.

ఒక నటిగా అన్ని డిఫరెంట్ పాత్రలు చేయాలని వుంది. ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నా అని చెప్పుకొచ్చింది రష్మిక.