‘వారిసు’, ‘మిషన్‌ మజ్ను’ విడుదల సందర్భంగా తాజాగా రష్మిక ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటిస్తూ.. తన స్నేహితురాలు సమంత గురించి స్పందించారు.

సామ్‌ మయోసైటిస్‌తో బాధపడుతోన్న విషయం ప్రకటించే వరకూ తనకు తెలియదని చెప్పారు.

అంతకు ముందు తను ఎప్పుడూ ఆ విషయం గురించి మాట్లాడిన సందర్భాల్లేవు.

అగ్రకథానాయిక సమంతను తాను ఎప్పటికీ ఒక అమ్మలా రక్షించాలనుకుంటున్నట్లు నటి రష్మిక తెలిపారు.

సామ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెను ఎప్పటికీ ఒక స్ఫూర్తిగా భావిస్తుంటానని అన్నారు. 

‘‘సమంత అద్భుతమైన మహిళ. ఆమె ఎంతో దయ కలిగిన, అందమైన వ్యక్తి.

జీవితంలో ఎన్నో సవాళ్లతో పోరాడి నిలబడిన వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఏవిధంగా అయితే స్ఫూర్తిగా భావిస్తారో అదేవిధంగా నేను కూడా ఆమె నుంచి ప్రేరణ పొందుతున్నాను.

ఆమెకు అన్నివిధాలుగా మంచే జరగాలని భావిస్తున్నా’’ అని రష్మిక తెలిపారు.